జైలు నుంచి సిద్దీఖి కప్పన్‌ విడుదల

కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్‌ దాదాపు 28 నెలల తర్వాత లఖ్‌నవూ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు.

Published : 03 Feb 2023 04:46 IST

లఖ్‌నవూ, దిల్లీ: కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్‌ దాదాపు 28 నెలల తర్వాత లఖ్‌నవూ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళిత యువతి (19)పై జరిగిన సామూహిక హత్యాచారం ఉదంతాన్ని కవర్‌ చేసేందుకు వెళుతూ సిద్దీఖి అరెస్టయ్యారు. ఆయన తరఫున బెయిలు షరతుల కింద ఒక్కొక్కటి రూ.లక్ష విలువైన రెండు పూచీకత్తులను న్యాయవాది బుధవారం నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కోర్టుకు సమర్పించారు. దీంతో లఖ్‌నవూ జిల్లా జైలు నుంచి సిద్దీఖి గురువారం విడుదలయ్యారు. హత్యాచారం తదనంతర పరిణామాలపై కూపీ లాగేందుకు సిద్దీఖి మరో ముగ్గురితో కలిసి బయల్దేరగా.. పోలీసులు అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు