ఎక్కువ స్థానాల్లో పోటీ.. రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు: సుప్రీం

ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు పోటీ చేయడంపై ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Published : 03 Feb 2023 04:46 IST

దిల్లీ: ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు పోటీ చేయడంపై ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది శాసనవిధానానికి సంబంధించిన అంశమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా కాదని స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీకి అనుమతించడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం మరింత ముందుకు సాగుతుందా లేదా అనేది అంతిమంగా పార్లమెంటు సంకల్పం అని తెలిపింది. అందువల్ల ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 33(7)ను కొట్టివేయడం సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని