అంత్యక్రియలకు ముందు కళ్లు తెరిచిన 109 ఏళ్ల బామ్మ

మరణించిందనుకున్న 109 ఏళ్ల బామ్మ 7 గంటల తర్వాత లేచి కూర్చోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.

Published : 03 Feb 2023 06:41 IST

మరణించిందనుకున్న 109 ఏళ్ల బామ్మ 7 గంటల తర్వాత లేచి కూర్చోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నర్సన్‌ ఖుర్ద్‌ గ్రామానికి చెందిన జ్ఞాన్‌ దేవి అనే వృద్ధురాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రిలో చేర్పించగా ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. శ్మశానవాటికకు తీసుకెళ్లే కొన్ని నిమిషాల ముందు వృద్ధురాలి శరీరంలో చలనం కనిపించడంతో వారు ఆమెను కదిలించారు. ఇంతలో ఆమె కళ్లు తెరిచి లేచి కూర్చుంది. బామ్మను ఏమైనా తింటావా అని అడగగా, తనకు చాట్‌ తినాలనుందని చెప్పింది. వెంటనే వారు చాట్‌ తీసుకొచ్చి బామ్మ కోరికను తీర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు