బోన్సాయ్‌ బాబా వాకిట్లో 400 రకాల చెట్లు

ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌కు చెందిన రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి రవి త్రివేదికి బోన్సాయ్‌ చెట్లను పెంచడమంటే చాలా ఇష్టం. తన ఇంట్లో 400 రకాల బోన్సాయ్‌ వృక్షాలు ఉన్నాయి.

Published : 03 Feb 2023 05:37 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌కు చెందిన రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి రవి త్రివేదికి బోన్సాయ్‌ చెట్లను పెంచడమంటే చాలా ఇష్టం. తన ఇంట్లో 400 రకాల బోన్సాయ్‌ వృక్షాలు ఉన్నాయి. వాటిలో 47 ఏళ్ల మర్రి చెట్టు, 27 ఏళ్ల రావి చెట్టు కూడా ఉండటం విశేషం. స్థానికులు ‘బోన్సాయ్‌ బాబా’గా పిలుచుకునే ఆయన పెరట్లో రుద్రాక్ష, కాఫీ,  బిర్యానీ ఆకు చెట్లు, దానిమ్మ, అంజీర, కొబ్బరి చెట్లు, యాలకులు, జామ, మల్బరీ, శమీ, పీచు, పనియాల వంటి పలు రకాల చెట్లు కనిపిస్తాయి. బోన్సాయ్‌ చెట్ల పెంపకంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాజ్‌భవన్‌కు, సీఎం కార్యాలయానికి కూడా బోన్సాయ్‌ చెట్లను కానుకలుగా పంపించినట్లు త్రివేది తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని