బీబీసీపై నిషేధం విధించాలంటూ సుప్రీంలో పిటిషన్‌

గుజరాత్‌ అల్లర్ల(2002)పై వివాదాస్పద డాక్యుమెంటరీని రూపొందించినందుకుగాను భారత్‌లో బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ)పై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 03 Feb 2023 05:24 IST

దిల్లీ: గుజరాత్‌ అల్లర్ల(2002)పై వివాదాస్పద డాక్యుమెంటరీని రూపొందించినందుకుగాను భారత్‌లో బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ)పై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని గురువారం కోరారు. అయితే సంబంధిత పిటిషన్‌ను అత్యవసర విచారణ కోసం శుక్రవారం మళ్లీ ప్రస్తావించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. అంతర్జాతీయంగా భారత్‌ ఎదుగుదలను, ప్రధాని మోదీ ప్రతిష్ఠను ఓర్వలేక గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ పక్షపాత ధోరణితో డాక్యుమెంటరీని రూపొందించిందని పిటిషన్‌లో ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు