భారత్‌ మాకు అత్యంత కీలక అంతర్జాతీయ భాగస్వామి

గోధ్రా అల్లర్లు(2002)కు సంబంధించిన బీబీసీ డాక్యుమెంటరీపై భారత సంతతి ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ వివాదంపై బ్రిటన్‌ ప్రభుత్వం స్పందించింది.

Published : 03 Feb 2023 05:24 IST

బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై బ్రిటన్‌ 

లండన్‌: గోధ్రా అల్లర్లు(2002)కు సంబంధించిన బీబీసీ డాక్యుమెంటరీపై భారత సంతతి ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ వివాదంపై బ్రిటన్‌ ప్రభుత్వం స్పందించింది. ఒక మీడియా సంస్థగా కథనాలను వెలువరించే స్వేచ్ఛ,స్వతంత్రత బీబీసీకి ఉంటుందని సమర్థించింది. అదే సమయంలో... భారత్‌తో తాము బలమైన స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అధికార ప్రతినిధి బుధవారం లండన్‌లోని డౌనింగ్‌ స్ట్రీట్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇండియా: ద మోదీ క్వశ్చిన్‌’ డాక్యుమెంటరీని భారత్‌ ఖండించిన విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు అధికార ప్రతినిధి బదులిచ్చారు. ‘బీబీసీ స్వతంత్ర మీడియా సంస్థ. బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌ను అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయమైన భాగస్వామిగా పరిగణిస్తోంది. భవిష్యత్తులోనూ దానిని కొనసాగిస్తూ ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అభిలషిస్తోంది’ అని తెలిపారు. డాక్యుమెంటరీ వివాదంపై బ్రిటన్‌ పార్లమెంటులో విదేశీ వ్యవహారాల మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ కూడా  ఇదే విధమైన ప్రకటన చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు