రెండు వేర్వేరు ప్రక్రియలను ఒకేసారి ఎలా ప్రారంభిస్తారు?

కిషన్‌ గంగ, రాటిల్‌ ప్రాజెక్టులకు సంబంధించి భారత్‌ పాక్‌ల మధ్య వివాదాలను పరిష్కరించడానికి రెండు వేర్వేరు ప్రక్రియలను ఒకేసారి ప్రారంభించడంపై ప్రపంచబ్యాంక్‌ను గురువారం భారత్‌ గట్టిగా నిలదీసింది.

Published : 03 Feb 2023 05:24 IST

 ప్రపంచబ్యాంకును నిలదీసిన భారత్‌

దిల్లీ: కిషన్‌ గంగ, రాటిల్‌ ప్రాజెక్టులకు సంబంధించి భారత్‌ పాక్‌ల మధ్య వివాదాలను పరిష్కరించడానికి రెండు వేర్వేరు ప్రక్రియలను ఒకేసారి ప్రారంభించడంపై ప్రపంచబ్యాంక్‌ను గురువారం భారత్‌ గట్టిగా నిలదీసింది. ఆ రెండు ప్రాజెక్టులపై పాక్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాద పరిష్కారానికి తటస్థ నిపుణుడ్ని, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రపంచబ్యాంకు ఇటీవల ప్రకటించింది. ఇది సింధూ జలాల ఒప్పంద (ఐడబ్ల్యూటీ) నిబంధనలకు విరుద్ధమని భారత్‌ తొలి నుంచీ వాదిస్తోంది. ‘ఐడబ్ల్యూటీకి కొత్త అర్థాలు చెప్పే అధికారం ప్రపంచబ్యాంకుకి లేదనే అనుకుంటున్నాను. ఇది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. ఇందులో సమస్యల పరిష్కారానికి దశల వారీ విధానాలు అందుబాటులో ఉన్నాయి.’ అని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చీ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు