త్వరలో నిమిషానికి 2.25 లక్షల రైలు టికెట్‌లు

ప్రస్తుతం నిమిషానికి 25 వేల రైలు టికెట్‌లను జారీ చేస్తుండగా ఆ సంఖ్యను 2.25 లక్షలకు చేరేలా రైల్వేల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తామని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం ప్రకటించారు.

Published : 04 Feb 2023 04:07 IST

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌

దిల్లీ: ప్రస్తుతం నిమిషానికి 25 వేల రైలు టికెట్‌లను జారీ చేస్తుండగా ఆ సంఖ్యను 2.25 లక్షలకు చేరేలా రైల్వేల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తామని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇపుడు నిమిషానికి 40 వేల విచారణ (ఎంక్వైరీ)లను వింటున్నామని ఆ సంఖ్యను నాలుగు లక్షలకు చేరుస్తామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏడు వేల కిలోమీటర్ల మేర నూతన రైలు మార్గాన్ని నిర్మించనున్నామని తెలిపారు. 2014కి ముందు రైల్వే రోజుకు నాలుగు కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని నిర్మించగా ప్రస్తుతం అది 12 కిలోమీటర్లుగా ఉందన్నారు. రెండు వేల రైల్వే స్టేషన్లలో 24 గంటలూ పనిచేసేలా జన్‌ సువిధ స్టోర్‌లను నిర్మిస్తామని ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులకు రూ.59,837 కోట్ల రాయితీలు ఇచ్చామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజ్యసభకు శుక్రవారం తెలిపారు. ఇది సగటున రైళ్లలో ప్రయాణించిన ప్రతి వ్యక్తికీ 53 శాతం రాయితీ ఇవ్వడంతో సమానమని స్పష్టం చేశారు. వృద్ధులకు రైల్వే టికెట్‌లపై రాయితీ పునరుద్ధరణ గురించి సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వమ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని