అమెరికా నుంచి భారత కంటి చుక్కల మందు రీకాల్‌

భారత్‌కు చెందిన కంటి చుక్కల వల్ల ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తోందని తమ రాష్ట్రాలను అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో దేశానికి చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌ కేర్‌ సంస్థ తమ మందులను రీకాల్‌ చేసింది.

Published : 04 Feb 2023 04:07 IST

ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తే కారణం

దిల్లీ: భారత్‌కు చెందిన కంటి చుక్కల వల్ల ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తోందని తమ రాష్ట్రాలను అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో దేశానికి చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌ కేర్‌ సంస్థ తమ మందులను రీకాల్‌ చేసింది. ‘‘ఎజ్రీకేర్‌, ఎల్‌ఎల్‌సీ, డెల్సమ్‌ ఫార్మా పంపిణీ చేసిన ఆర్టిఫిషియల్‌ టియర్స్‌ కంటి చుక్కల మందు సీసాలను మార్కెట్‌ నుంచి స్వచ్ఛందంగా రీకాల్‌ చేస్తున్నాం. ఈ మందు కలుషితమయ్యే అవకాశాలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ కంటి చుక్కలతో అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55మంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇందులో ఒకరు రక్త ఇన్‌ఫెక్షన్‌తో మరణించారు. కొందరు పూర్తిగా దృష్టి కోల్పోగా.. ఇంకొందరు కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. కేంద్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెండు బృందాలు చెన్నైలోని ఔషధ తయారీ కేంద్రాన్ని తనిఖీ చేయనున్నట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు