భారత ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో సింగపూర్‌ సీజేఐ

భారత సర్వోన్నత న్యాయస్థానంలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనంలో శుక్రవారం సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ భాగస్వామి అయ్యారు.

Published : 04 Feb 2023 04:07 IST

భారత సర్వోన్నత న్యాయస్థానంలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనంలో శుక్రవారం సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ భాగస్వామి అయ్యారు. సింగపూర్‌ నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా 2012లో బాధ్యతలు చేపట్టిన మేనన్‌.. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవాల్లో పాల్గొనేందుకు భారత్‌ చేరుకున్న ఆయన.. శనివారం జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ‘మారుతోన్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అంశంపై ప్రసంగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని