జైల్లో నుంచి పరీక్ష రాసి గోల్డ్‌ మెడల్‌

పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఓ మాజీ విద్యార్థి నాయకుడు ఎం.ఏలో అగ్రస్థానంలో నిలిచి గవర్నరు నుంచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు.

Updated : 04 Feb 2023 10:11 IST

గువాహటి: పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఓ మాజీ విద్యార్థి నాయకుడు ఎం.ఏలో అగ్రస్థానంలో నిలిచి గవర్నరు నుంచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. అతడు జైల్లో ఉంటూనే పరీక్ష రాసి ఈ ఘనత సాధించడం విశేషం. 2019లో అస్సాంలోని గువాహటిలో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో సంజీబ్‌ తాలుక్‌దార్‌ అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. గువాహటి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అతడు ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ సోషియాలజీ కోర్సు చేశాడు. ఇటీవల రాసిన పరీక్షల్లో 71 శాతం మార్కులతో తొలి స్థానంలో నిలిచాడు. గవర్నరు జగదీశ్‌ ముఖి అతడికి గురువారం గోల్డ్‌ మెడల్‌ బహూకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని