కశ్మీర్‌లోనూ జోషీమఠ్‌ పరిస్థితులు

ఇటీవల ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో నెలకొన్న పరిస్థితులే తాజాగా జమ్మూ-కశ్మీర్‌లోని దోడా జిల్లా థాత్రి ప్రాంతం నయీ బస్తీ గ్రామంలోనూ చోటుచేసుకుంటుండటంతో స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

Published : 04 Feb 2023 04:07 IST

నయీ బస్తీ గ్రామంలో కుంగుతున్న  భూమి.. గోడలకు పగుళ్లు

జమ్మూ: ఇటీవల ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో నెలకొన్న పరిస్థితులే తాజాగా జమ్మూ-కశ్మీర్‌లోని దోడా జిల్లా థాత్రి ప్రాంతం నయీ బస్తీ గ్రామంలోనూ చోటుచేసుకుంటుండటంతో స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. రెండు రోజులుగా ఇక్కడ భూమి కుంగిపోతూ ఇళ్ల గోడలు బీటలువారుతున్నాయి. అక్కడ 50కి పైగా ఇళ్లు ఉండగా.. శుక్రవారం నాటికి 21 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ సంఖ్య పెరిగే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక 19 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. అక్కడి పరిస్థితులపై స్పందించిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలను తాత్కాలిక శిబిరాలకు తరలించామని  థాత్రి సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ అథర్‌ అమీన్‌ జర్గర్‌ తెలిపారు. రోడ్డు నిర్మాణం కోసం సమీప ప్రాంతాల్లో బుల్డోజర్‌తో తవ్వకాలు జరుపుతుండటంతోనే కొండచరియలు విరిగిపడుతూ భూమి కుంగిపోయి ఇళ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు