కుక్కలను ప్రేమించాలంటూ.. 517కి.మీల సైకిల్‌ యాత్ర

మూగజీవాలను కాపాడేందుకు వినూత్న యాత్రకు శ్రీకారం చుట్టారు ఇద్దరు తోబుట్టువులు. కుక్కల్ని కాపాడాలి.. వాటిని ప్రేమించాలి అనే సందేశంతో 517కి.మీ. సైకిల్‌ యాత్ర చేపట్టారు.

Published : 04 Feb 2023 04:07 IST

మూగజీవాలను కాపాడేందుకు వినూత్న యాత్రకు శ్రీకారం చుట్టారు ఇద్దరు తోబుట్టువులు. కుక్కల్ని కాపాడాలి.. వాటిని ప్రేమించాలి అనే సందేశంతో 517కి.మీ. సైకిల్‌ యాత్ర చేపట్టారు. వారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీప్తో రాయ్‌, అతడి సోదరి చందా పంజా. దీప్తో రాయ్‌ ఓ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తుండగా.. సోదరి పాఠశాల ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి వీరికి జంతువులంటే ఇష్టం. శునకాల సంరక్షణపై అవగాహన కల్పించడంతోపాటు అనారోగ్యానికి గురైనవాటికి చికిత్స అందించే లక్ష్యంతో ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. అందుకోసం ఔషధాలు, వైద్య పరికరాలను వెంట తీసుకెళ్తున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌ వరకూ యాత్ర చేస్తామని వారు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని