హిందూ యువతులను అపహరిస్తున్న ముస్లింలు: బాబా రాందేవ్‌

ముస్లింలు హిందూ యువతులను అపహరిస్తున్నారని యోగాగురు రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు మత మార్పిళ్లకు పాల్పడుతుంటే హిందూమతం.

Updated : 04 Feb 2023 04:50 IST

 జైపుర్‌: ముస్లింలు హిందూ యువతులను అపహరిస్తున్నారని యోగాగురు రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు మత మార్పిళ్లకు పాల్పడుతుంటే హిందూమతం.. హిందువులను మంచి పనులు చేయాలంటూ బోధిస్తుందని తెలిపారు. ‘‘ప్రతి రోజు ముస్లింలు అయిదుసార్లు నమాజు చేస్తారు. ఆ తరువాత వారేం కోరుకుంటే అది చేస్తారు. హిందూ యువతులను అపహరిస్తారు. కొంతమంది ప్రపంచమంతటినీ ఇస్లాంగా మార్చేయడంపై, మరికొందరు క్రైస్తవంలోకి మార్చాలంటూ మాట్లాడతారు. కొందరు ఉగ్రవాదులుగా మారుతుంటారు.. మరోపక్క నమాజు చేస్తుంటారు’’ అని బార్మేర్‌లో గురువారం జరిగిన ఓ సమావేశంలో రాందేవ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు