పదో తరగతి విద్యార్థి.. విద్యుత్‌ సైకిల్‌ రూపకర్త

హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌తో బాధపడుతున్న కేరళకు చెందిన సయంత్‌.. విద్యుత్‌ ఛార్జింగుతో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు.

Published : 05 Feb 2023 06:20 IST

హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌తో బాధపడుతున్న కేరళకు చెందిన సయంత్‌.. విద్యుత్‌ ఛార్జింగుతో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు. నాలుగు గంటలు ఛార్జ్‌ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెప్పాడు. సయంత్‌కు చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్‌ వస్తువులంటే చాలా ఆసక్తి. ఏ చిన్న మెషిన్‌ చూసినా ఒక పట్టు పట్టేవాడు. పలు విధాలుగా దాన్ని వాడుకునేవాడు. కాలికట్‌ జిల్లాలోని కోయిలాండికి చెందిన శ్రీధరన్‌, గీతల కుమారుడైన సయంత్‌.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. కొన్ని విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టడం, వెంటనే ఏకాగ్రత కోల్పోవడం హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌ లక్షణం. అయినప్పటికీ.. తన నైపుణ్యంతో జిల్లా సైన్స్‌ ఫెయిర్‌లో సయంత్‌ బహుమతి గెలుచుకున్నాడు. ‘‘హ్యాండిల్‌ దగ్గర బ్యాటరీ ఇండికేటర్‌ ఉంటుంది. అది ఛార్జింగ్‌ అయిపోతే చెబుతుంది. ఈ సైకిల్‌ తయారీకి సుమారు రూ.25 వేలు ఖర్చు అవుతోంది. దీనికి బీఎల్‌డీసీ మోటర్‌, బైక్‌ చైన్‌ అమర్చా. పదో తరగతి పూరయ్యాక పాలిటెక్నిక్‌ చదవాలనుకుంటున్నా’’ అని సయంత్‌ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని