10న ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగం

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈనెల 10న ఉదయం 9.18 గంటలకు చిన్న ఉపగ్రహ వాహకనౌక-డీ2 (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 05 Feb 2023 04:40 IST

నేటి నుంచి అనుసంధానం

శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈనెల 10న ఉదయం 9.18 గంటలకు చిన్న ఉపగ్రహ వాహకనౌక-డీ2 (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనుసంధాన కార్యక్రమాలు షార్‌లోని మొదటి ప్రయోగ వేదికలో ఆదివారం ప్రారంభంకానున్నాయి. రెండు రోజుల పాటు అనుసంధానం, అనంతరం వివిధ పరీక్షలు చేపట్టనున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ద్వారా ఈవోఎస్‌-07తో పాటు మరో రెండు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వీటి బరువు 334 కిలోలు. గత ఏడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలమైన నేపథ్యలో డీ2 ప్రయోగం విషయంలో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని