12 వేల అడుగుల ఎత్తులో ఐస్‌ స్కేటింగ్‌ ట్రాక్‌

హిమాచల్‌ ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లాలోని నాకో సరస్సు వద్ద సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 12 వేల అడుగుల ఎత్తులో సహజసిద్ధంగా ఉన్న ఈ సరస్సులో పొడవైన ఐస్‌ ట్రాక్‌ తీర్చిదిద్ది ఈ ఘనత సాధించారు.

Published : 05 Feb 2023 04:52 IST

నాకో సరస్సులో సరికొత్త ప్రపంచ రికార్డు

కిన్నౌర్‌(హిమాచల్‌ ప్రదేశ్‌): హిమాచల్‌ ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లాలోని నాకో సరస్సు వద్ద సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 12 వేల అడుగుల ఎత్తులో సహజసిద్ధంగా ఉన్న ఈ సరస్సులో పొడవైన ఐస్‌ ట్రాక్‌ తీర్చిదిద్ది ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేశారు. ఇక్కడ మైనస్‌ 18 డిగ్రీల వాతావరణంలో శనివారం జాతీయ స్థాయి ఐస్‌ స్కేటింగ్‌ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 15 రాష్ట్రాల నుంచి 70 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఐస్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలు ఆదివారం ముగుస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు