జోషీమఠ్ పరిస్థితి కశ్మీర్‌లో లేదు: ఎల్జీ
జమ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లా ఠాఠరీ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడిన ఘటనను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్‌సిన్హా శనివారం మీడియాకు తెలిపారు.
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లా ఠాఠరీ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడిన ఘటనను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్‌సిన్హా శనివారం మీడియాకు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో ఇటీవల నేల కుంగిన ఘటనకూ, దీనికి సారూప్యత లేదని స్పష్టం చేశారు. డోడా పట్టణానికి 35 కి.మీ.ల దూరంలోని ఠాఠరీ ప్రాంత నయీ బస్తీలో పగుళ్ల కారణంగా మూడిళ్లు కూలిపోగా.. 18 ఇళ్లకు బీటలు వారాయి. బాధితులందరికీ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సిన్హా వెల్లడించారు. ఈ ప్రాంతంలోని వంద కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడడానికి కారణాలపై పరిశోధనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం డోడా చేరుకుంది.
శ్మీరీ పండిట్లను బిచ్చగాళ్లు అనలేదు..
జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం కశ్మీరీ పండిట్ ఉద్యోగుల విషయంలో అమర్యాదగా వ్యవహరిస్తోందని, వారిని ఉద్దేశించి ‘బిచ్చగాళ్లు’ వంటి పదాలు ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధానికి రాసిన లేఖపై ఎల్జీ స్పందించారు. అటువంటి పదమేదీ తాను వాడలేదని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ap-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..