దేశంలో 94.50 కోట్ల ఓటర్లు

దేశంలో 1951 నుంచి ఇప్పటికి ఓటర్ల సంఖ్య దాదాపు ఆరు రెట్లు పెరిగి 94.50 కోట్లకు చేరుకుంది. ఇందులో సుమారు 30 కోట్ల మంది గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని తేలడంతో భవిష్యత్‌లో వీరిని పోలింగ్‌ బూత్‌లకు తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కసరత్తు చేస్తోంది.

Updated : 06 Feb 2023 06:48 IST

1951తో పోలిస్తే 6 రెట్లు అధికం

దిల్లీ: దేశంలో 1951 నుంచి ఇప్పటికి ఓటర్ల సంఖ్య దాదాపు ఆరు రెట్లు పెరిగి 94.50 కోట్లకు చేరుకుంది. ఇందులో సుమారు 30 కోట్ల మంది గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని తేలడంతో భవిష్యత్‌లో వీరిని పోలింగ్‌ బూత్‌లకు తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కసరత్తు చేస్తోంది. ఓటు వేయని వారిలో నగర, పట్టణ ప్రజలు, యువత, వలసదారులు ఉన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగంలో పట్టణ ప్రజల ఉదాసీనతను ఎన్నికల సంఘం మరోసారి ప్రస్తావించింది. వినూత్న పద్ధతుల ద్వారా రానున్న ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని ఈసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు