దొంగ చేతివేలు కొరికేసిన మహిళ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా కరారి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ దొంగకు చుక్కలు చూపించింది. నీతాదేవి, శ్రీచంద్‌ దంపతులు మయోహర్‌ గ్రామంలో నివాసం ఉంటున్నారు.

Published : 06 Feb 2023 03:35 IST

త్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా కరారి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ దొంగకు చుక్కలు చూపించింది. నీతాదేవి, శ్రీచంద్‌ దంపతులు మయోహర్‌ గ్రామంలో నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం నీతాదేవి కూరగాయల కోసం బజారుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను వెంబడించిన ఓ దొంగ నిర్మానుష్య ప్రదేశం వచ్చేసరికి అమాంతం దాడి చేశాడు. నీతాదేవి గట్టిగా అరవడంతో తన చేత్తో ఆమె నోరు మూశాడు. దొంగ చేతివేళ్లను ఆమె గట్టిగా కొరకడంతో ఒక చేతి వేలు తెగిపోయింది. ఇంతలో చుట్టుపక్కల జనం అక్కడికి చేరుకునేసరికి దొంగ అందినంత దోచుకొని పారిపోయాడు. దొంగ చేతివేలుతో నీతాదేవి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. బంగారు గొలుసు, ఓ కాలి పట్టీ, రూ.4 వేల నగదుతో దొంగ ఉడాయించినట్లు ఆమె పేర్కొంది. నీతాదేవి ధైర్యాన్ని మెచ్చుకొన్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు