విదేశీ దా‘రుణ’ యాప్‌లపై కొరడా

దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తూ ప్రజలను ఆకర్షించి ఆ తర్వాత వారి మానసిక వేదనకు కారణమవుతున్న రుణ, బెట్టింగ్‌ యాప్‌లపై కేంద్రం కొరడా ఝళిపించింది.

Published : 06 Feb 2023 03:35 IST

దిల్లీ: దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తూ ప్రజలను ఆకర్షించి ఆ తర్వాత వారి మానసిక వేదనకు కారణమవుతున్న రుణ, బెట్టింగ్‌ యాప్‌లపై కేంద్రం కొరడా ఝళిపించింది. చిన్న మొత్తంలో రుణాలు పొందిన సామాన్యుల్ని ఘోరంగా దోపిడీకి, వేధింపులకు గురిచేసి అనేకమంది ఆత్మహత్యలకు దారితీస్తోన్న ఈ దారుణ యాప్‌ల వ్యవహారంపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. విదేశాలకు చెందిన రుణ, బెట్టింగ్‌, జూదం వంటి వాటికి సంబంధించి దాదాపు 232 యాప్‌లను నిషేధించింది. హోంశాఖ ఆదేశాలతో ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో చైనాకు సంబంధించిన యాప్‌లూ ఉన్నాయి. నిషేధించిన వాటి వివరాలను అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు