స్కూల్‌బస్‌ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని

విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు.. డ్రైవరుకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ సమయంలో తెలివిగా వ్యవహరించిన ఓ విద్యార్థిని.. అందరినీ ప్రమాదం నుంచి కాపాడింది.

Updated : 06 Feb 2023 08:59 IST

విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు.. డ్రైవరుకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ సమయంలో తెలివిగా వ్యవహరించిన ఓ విద్యార్థిని.. అందరినీ ప్రమాదం నుంచి కాపాడింది. గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నగరంలోని భరద్‌ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తూ.. గొండాల్‌ రోడ్డు వద్దకు రాగానే డ్రైవరు గుండెపోటుతో మెలికలు తిరిగిపోయాడు. అదుపుతప్పి డివైడర్‌ దాటిన బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటూ పోయింది.

దీనిని గమనించిన భార్గవి వ్యాస్‌ అనే బాలిక వెంటనే స్టీరింగు  పట్టుకొని బస్సును నియంత్రించడంతో పెనుప్రమాదం తప్పింది. ‘‘నేను డ్రైవరు పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నా. బస్సు గొండాల్‌ రోడ్డు వద్దకు చేరుకోగానే.. డ్రైవర్‌ మాటలు తడబడ్డాయి. అతడి నోరు ఒకవైపునకు వచ్చేసి.. ముక్కు నుంచి రక్తం కారింది. స్టీరింగు వదిలేసి ఒక పక్కకు పడిపోయాడు. నేను వెంటనే స్టీరింగు తిప్పి బస్సును కరెంటు స్తంభానికి ఢీకొట్టి ఆపాను’ అని భార్గవి వివరించింది. డ్రైవర్‌ హారున్‌భాయ్‌ రాజ్‌కోట్‌ సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు