ఉమ్మడి పౌరస్మృతి భారత్‌లో సరికాదు.. ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌

భారత్‌ లాంటి వైవిధ్యం ఉన్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుచేయడం సరికాదని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ (ఏఐఎంపీఎల్‌బీ) అభిప్రాయపడింది.

Updated : 06 Feb 2023 06:02 IST

లఖ్‌నవూ: భారత్‌ లాంటి వైవిధ్యం ఉన్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుచేయడం సరికాదని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ (ఏఐఎంపీఎల్‌బీ) అభిప్రాయపడింది. దేశంలో ప్రబలుతున్న విద్వేషాన్ని ఆపాలని, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖ్‌నవూలో ఆదివారం బోర్డు సమావేశం జరిగింది. దేశంలో బలహీనవర్గాలు, మైనారిటీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా పరిగణించాలని న్యాయవ్యవస్థను సభ్యులు కోరారు. ‘‘దశాబ్దాల కిందట కట్టిన ఇళ్లను కూలుస్తున్నారు. శాంతియుత ప్రదర్శనలు చేస్తుంటే కఠినమైన చట్టాల కింద అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారు’’ అని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల పట్ల చూపుతున్న ఈ వివక్షను అందరూ ఖండించాలని కోరారు. స్థానిక ఇస్లామిక్‌ సెమినరీ నదవతుల్‌ ఉలేమాలో జరిగిన ఈ భేటీలో పలు తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. మతాలు, సంస్కృతుల పరంగా ఎంతో వైవిధ్యం ఉన్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుచేయడం ద్వారా పౌరులకు వ్యక్తిగత చట్టాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు దూరమవుతాయని అందరూ అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు