పరుగు పోటీలో 72 ఏళ్ల వృద్ధుడికి గోల్డ్‌మెడల్‌

పంజాబ్‌లోని లుధియానాలో మినీ ఒలింపిక్స్‌ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం జరిగిన సీనియర్‌ సిటిజన్ల 100 మీటర్ల పరుగు పోటీలో సురీందర్‌ శర్మ (72) బంగారు పతకాన్ని సాధించారు.

Published : 06 Feb 2023 05:58 IST

పంజాబ్‌లోని లుధియానాలో మినీ ఒలింపిక్స్‌ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం జరిగిన సీనియర్‌ సిటిజన్ల 100 మీటర్ల పరుగు పోటీలో సురీందర్‌ శర్మ (72) బంగారు పతకాన్ని సాధించారు. దీంతోపాటు 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్‌ రేసులోనూ ఈయన పాల్గొన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వ్యాయామం.. ఇంటి తిండి తన ఆరోగ్య రహస్యాలని చెబుతున్న సురీందర్‌ శర్మ దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగే పోటీలకూ వెళ్తుంటారు. ఇప్పటికే చాలా పతకాలు సాధించారు కూడా. బల్బీర్‌సింగ్‌ (76), జర్నైల్‌సింగ్‌ (74) సైతం ఈ పోటీల్లో చురుగ్గా పరుగులు తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని