యువత క్రీడారంగంలో ఉపాధి పొందేలా ప్రోత్సాహం

క్రీడారంగంలో ఉపాధి పొందే విధంగా యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు.

Updated : 06 Feb 2023 06:32 IST

ఫిట్‌గా ఉంటేనే ఇక్కడ సూపర్‌ హిట్‌
ప్రధాని నరేంద్రమోదీ

జైపుర్‌:  క్రీడారంగంలో ఉపాధి పొందే విధంగా యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన జైపుర్‌ రూరల్‌ ఎంపీ రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ నిర్వహిస్తున్న ‘జైపుర్‌ మహాఖేల్‌’ కార్యక్రమంలో దృశ్యమాధ్యమ విధానం ద్వారా మోదీ ఆదివారం ప్రసంగించారు. 2014లో ఇచ్చిన రూ.850 కోట్లతో పోలిస్తే ఈ రంగానికి ప్రస్తుత బడ్జెట్‌లో మూడొంతులు ఎక్కువగా రూ.2500 కోట్ల నిధులు కేటాయించామని మోదీ గుర్తుచేశారు. క్రీడాకారులకు అవార్డులతో ఇచ్చే నగదు ప్రోత్సాహకాల మొత్తాన్ని ఇతోధికంగా పెంచామన్నారు. యువత పేదరికం కారణంగా వెనకబడకూడదని ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.ఐదు లక్షల వరకు ఇస్తున్నట్లు తెలిపారు. ఫిట్‌గా ఉంటేనే ఈ రంగంలో హిట్‌ అవుతామని క్రీడాకారులకు సూచించారు. ఒలింపిక్స్‌ వంటి ప్రపంచస్థాయి పోటీల్లో గెలవడమే లక్ష్యంగా ప్రయత్నించాలని మోదీ దిశానిర్దేశం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు