వాట్సప్‌ నంబరుకు ఆర్డరిస్తే.. రైళ్లలో నచ్చిన ఆహారం

రైళ్లలో ప్రయాణికులు తమకు నచ్చిన ఆహార పదార్థాలు.. నచ్చిన హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆర్డరిచ్చే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం వాట్సప్‌ నంబరును ప్రవేశపెడుతున్నారు.

Updated : 07 Feb 2023 09:46 IST

దిల్లీ: రైళ్లలో ప్రయాణికులు తమకు నచ్చిన ఆహార పదార్థాలు.. నచ్చిన హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆర్డరిచ్చే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం వాట్సప్‌ నంబరును ప్రవేశపెడుతున్నారు. ఐఆర్‌సీటీసీ ఇప్పటికే ఇ-కేటరింగ్‌ పేరుతో కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో వాట్సప్‌ నంబరు 8750001323 ద్వారా ఆహారం అందజేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా www.catering.irctc.co.in  వెబ్‌సైట్‌, ‘ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌’ పేరిట యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రయాణికుడు ఇ-టికెట్‌ బుక్‌ చేసినప్పుడు వెబ్‌సైట్‌లో ఇ-కేటరింగ్‌ ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకున్న వారికి సదరు వాట్సాప్‌ నంబరు నుంచి సందేశం వస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి రైలులో ఆహారాన్ని ఆర్డర్‌ ఇవ్వొచ్చు. దీంతోపాటు ఇ-కేటరింగ్‌ వైబ్‌సైట్‌ ద్వారా ఆయా ప్రయాణ మార్గాల్లో వచ్చే పట్టణాలు, నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి నచ్చిన ఆహార పదార్థాలను ఆర్డరిచ్చే సౌలభ్యం కూడా ఉంది. ప్రయాణికుల అభిప్రాయాలు, సలహాలు తీసుకున్న అనంతరం ఈ సౌకర్యాన్ని ఇతర రైళ్లలో కూడా ప్రవేశపెడుతున్నట్లు సోమవారం రైల్వేకు చెందిన అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని