Marriage: వరుడికి 65.. వధువుకు 23

65 ఏళ్ల వ్యక్తి.. 23 ఏళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అంతే కాకుండా పెళ్లి ఊరేగింపులో తన ఆరుగురు కుమార్తెలతో కలిసి డీజే పాటలకు హుషారుగా నృత్యం కూడా చేశాడు.

Updated : 07 Feb 2023 07:30 IST

65 ఏళ్ల వ్యక్తి.. 23 ఏళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అంతే కాకుండా పెళ్లి ఊరేగింపులో తన ఆరుగురు కుమార్తెలతో కలిసి డీజే పాటలకు హుషారుగా నృత్యం కూడా చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో జరిగిందీ వివాహం. జిల్లాలోని హుసైనాబాద్‌ పూరే చౌధరి గ్రామానికి చెందిన నఖేద్‌ యాదవ్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరుగురు కుమార్తెలు జన్మించారు. ఆ తర్వాత అతడి భార్య చనిపోయింది. అప్పట్నుంచి ఆయన ఒంటరి జీవితం గడుపుతున్నాడు. దీన్నుంచి బయటపడేందుకు.. కుటుంబసభ్యుల అంగీకారంతో రుదౌలీ ప్రాంతంలో 23 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత బరాత్‌ కూడా ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో నఖేద్‌, అతని ఆరుగురు కుమార్తెలు, బంధువులు హుషారుగా నృత్యాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని