కుమార్తె మృతదేహంతో ఇంటింటికీ తిరిగిన తల్లి

అంత్యక్రియలకు సాయం చేయాలని కోరుతూ ఓ మహిళ తన కుమార్తె మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకొని రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగింది.

Published : 07 Feb 2023 06:12 IST

అంత్యక్రియలకు సాయం చేయాలని కోరుతూ ఓ మహిళ తన కుమార్తె మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకొని రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మహిళకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల క్రితం ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. భర్త చికిత్స చేయించకపోగా.. ఆమెను దూరం పెట్టాడు. పౌష్టికాహారం లేక కుమార్తె ఆరోగ్యమూ క్షీణించింది. మరోవైపు, చర్చికి వెళ్లడంపై అభ్యంతరం తెలిపిన పుట్టింటివారు ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. సరైన చికిత్స అందక ఆమె కుమార్తె ఫిబ్రవరి 4న మరణించింది. కుమార్తె అంత్యక్రియలు చేయడానికి ఆమె దగ్గర చిల్లిగవ్వ లేదు. దీంతో కుమార్తె మృతదేహాన్ని వెంటబెట్టుకొని శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు సాయం కోసం ఇంటింటికీ తిరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంకేర్‌ జిల్లా అధికారులు అంత్యక్రియలు జరిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు