కుక్క కరిచిన 12 ఏళ్లకు.. యజమానికి మూడేళ్ల జైలు

పెంపుడు శునకం ఒకరిని కరవడమే కాకుండా.. దాని పట్ల అజాగ్రత్తగా ఉన్నందుకు యజమానికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది మహారాష్ట్రలోని గిర్‌గావ్‌ కోర్టు. 2010లో.. నిందితుడు హొర్ముస్జి, కేస్రీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు ముంబయిలోని నేపియన్‌సీ వద్ద నిలబడి గొడవ పడుతున్నారు.

Published : 07 Feb 2023 07:45 IST

ముంబయి: పెంపుడు శునకం ఒకరిని కరవడమే కాకుండా.. దాని పట్ల అజాగ్రత్తగా ఉన్నందుకు యజమానికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది మహారాష్ట్రలోని గిర్‌గావ్‌ కోర్టు. 2010లో.. నిందితుడు హొర్ముస్జి, కేస్రీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు ముంబయిలోని నేపియన్‌సీ వద్ద నిలబడి గొడవ పడుతున్నారు. హొర్ముస్జి పెంచుకుంటున్న శునకం అక్కడే కారులోనే ఉంది. వారు మాట్లాడుతుండగా.. అది బయటకి రావడానికి ప్రయత్నించింది. ఇరానీ.. దాన్ని బయటకు వదలొద్దని హెచ్చరించారు. హొర్ముస్జి కావాలని ఆ శునకాన్ని కారు నుంచి బయటకు వదిలాడు. దీంతో ఆ కుక్క ఇరానీపై దాడి చేసింది. ఆయన కుడి కాలిపై రెండు సార్లు, కుడి చేతిపై ఒకసారి కరిచింది. దీంతో ఇరానీ కోర్టును ఆశ్రయించారు. 12ఏళ్ల తర్వాత తాజాగా కోర్టు తీర్పునిస్తూ.. ‘‘హొర్ముస్జి పెంచుకుంటున్న రోట్‌వీలర్‌ జాతి శునకం కరిచే జంతువు. ఆ విషయం తెలిసీ ఆయన దాని పట్ల అశ్రద్ధ వహించారు. అంతే కాకుండా ప్రజా భద్రతను విస్మరించారు. 72 ఏళ్ల వ్యక్తిపై అంత బలమైన శునకం దాడి చేసి కాట్లు వేసింది. కుక్క యజమాని ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి.. ఆయన చేసిన నిర్లక్ష్యానికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నాం’’ అని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు