భూతాపంపై పోరుకు 50 మిలియన్‌ డాలర్లు

భూతాపంపై పోరాటంతోపాటు దీని నుంచి మహిళలకు ఉపశమనం కలిగించేందుకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ 50 మిలియన్‌ డాలర్ల(413.6 కోట్లు)ను ప్రకటించారు.

Updated : 07 Feb 2023 05:25 IST

మహిళల ఉపశమనానికి చర్యలు
హిల్లరీ క్లింటన్‌ ప్రకటన

సురేంద్రనగర్‌: భూతాపంపై పోరాటంతోపాటు దీని నుంచి మహిళలకు ఉపశమనం కలిగించేందుకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ 50 మిలియన్‌ డాలర్ల(413.6 కోట్లు)ను ప్రకటించారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆమె సోమవారం సురేంద్రనగర్‌ జిల్లా కుడా గ్రామ సమీపంలోని లిటిల్‌ రాన్‌ ఆఫ్‌ కచ్‌లో ఉప్పు తయారుచేసే కార్మికులతో సమావేశమయ్యారు. సామాజిక కార్యకర్త, దివంగత ఇలా భట్‌ స్థాపించిన మహిళా స్వయం సహాయక సంఘం (సేవా) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సాధికారతతో పాటు, జీవన వనరుల పెంపు, విద్యకు ఈ నిధి ఊతమిస్తుందని తెలిపారు. వాతావరణంలో దుష్ప్రభావాలపైనా మహిళలు పోరాడటానికి నిధులు వెచ్చించవచ్చని అన్నారు. సేవా సంస్థతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, వచ్చే 50 ఏళ్ల కార్యాచరణపై ఇప్పుడే ఆలోచిస్తున్నామని తెలిపారు. నిర్మాణ రంగంలో ఉన్నా.. వ్యవసాయం చేస్తున్నా ఉష్ణోగ్రతలో వచ్చే భారీ మార్పులే అతి పెద్ద సవాలుగా నిలువనున్నాయని వివరించారు. ఉప్పు తయారుచేస్తున్న తీరును కార్మికుల నుంచి ఆమె స్వయానా తెలుసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు