రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఐదుగురు గృహిణులు కేంద్ర ప్రభుత్వ పథకం నిధులు తీసుకొని తమ ప్రియుళ్లతో ఉడాయించారు.

Updated : 08 Feb 2023 07:23 IST

బారాబంకీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఐదుగురు గృహిణులు కేంద్ర ప్రభుత్వ పథకం నిధులు తీసుకొని తమ ప్రియుళ్లతో ఉడాయించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద.. భూమి ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్రం రూ.3 లక్షలు అందజేస్తోంది. ఇటీవల బారాబంకీ జిల్లా నుంచి 40 మంది మహిళలను లబ్ధిదారులుగా అధికారులు ఎంపిక చేశారు.

కొందరు మహిళల ఖాతాల్లో మొదటి వాయిదా కింద రూ.50,000 చొప్పున జమ చేశారు. ఖాతాల్లో నగదు జమ అవగానే ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో కలిసి వెళ్లిపోయారు. మరోవైపు, రెండో విడత డబ్బులను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భార్యల ఖాతాల్లో జమ చేయొద్దని బాధిత భర్తలు అధికారులను వేడుకొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు