రాఖీ సావంత్‌ భర్త దుర్రాని అరెస్టు

నటి రాఖీ సావంత్‌ భర్త అదిల్‌ దుర్రాని మంగళవారం రాత్రి అరెస్టు అయ్యారు. తనపై అసహజ శృంగారానికి పాల్పడ్డాడని, తన ఇంట్లో నుంచి డబ్బులు, నగలను దొంగిలించాడని, వరకట్నం విషయంలో వేధిస్తున్నాడని రాఖీ సావంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published : 08 Feb 2023 04:50 IST

అసహజ శృంగారం, వరకట్న వేధింపుల ఆరోపణలపై..

ముంబయి: నటి రాఖీ సావంత్‌ భర్త అదిల్‌ దుర్రాని మంగళవారం రాత్రి అరెస్టు అయ్యారు. తనపై అసహజ శృంగారానికి పాల్పడ్డాడని, తన ఇంట్లో నుంచి డబ్బులు, నగలను దొంగిలించాడని, వరకట్నం విషయంలో వేధిస్తున్నాడని రాఖీ సావంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను ప్రశ్నించారు. గత ఏడాది జనవరిలో నటి రాఖీ సావంత్‌, దుర్రాని ఓ వ్యాపారం విషయంలో కలిశారు. సావంత్‌కు తెలియకుండానే రూ.1.5కోట్లను బ్యాంకు నుంచి తీసి దుర్రాని ఓ కారు కొన్నాడు. పెళ్లి చేసుకుంటానని సావంత్‌కు దుర్రాని హామీ ఇవ్వటంతో ఆమె ఈ విషయంలో ఏమీ మాట్లాడలేదు. పెళ్లి అనంతరం దుర్రాని తనని చిత్రహింసలు పెట్టాడని.. యాసిడ్‌ పోస్తానని బెదిరించాడని సావంత్‌ వెల్లడించింది. ఆదివారం రాత్రి తన ఇంట్లో రూ.5లక్షలు, రూ.2.5లక్షల విలువ చేసే నగలు కనిపించకపోవడంతో దుర్రానిపై సోమవారం రాత్రి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని