నాగౌర్‌లోని ఖింవసర్‌ కోటలో.. స్మృతీ ఇరానీ కుమార్తె వివాహానికి ఏర్పాట్లు

రాజస్థాన్‌ నాగౌర్‌లోని ఖింవసర్‌ కోటలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కుమార్తె షనీల్‌ ఇరానీ వివాహానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 08 Feb 2023 04:50 IST

జోధ్‌పుర్‌: రాజస్థాన్‌ నాగౌర్‌లోని ఖింవసర్‌ కోటలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కుమార్తె షనీల్‌ ఇరానీ వివాహానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ముందస్తు వేడుకలు కొనసాగనునున్నాయి. స్మృతీ ఇరానీ భర్త జుబిన్‌ మంగళవారం జోధ్‌పూర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి ఖింవసర్‌కు వెళ్లారు. ఇక్కడి కోట సమీపంలోని ఇసుక తిన్నెలపై వధువు షనీల్‌, వరుడు అర్జున్‌ భల్లాకు 2021లో నిశ్చితార్థమైంది. ప్రస్తుతం ఇరు కుటుంబాలూ వివాహానికి భారీ ఏర్పాట్లు చేశాయి. స్మృతీ ఇరానీ భర్త మొదటి భార్య మోనా కుమార్తే షనీల్‌. షనీల్‌ వృత్తిరీత్యా న్యాయవాది. స్మృతీ ఇరానీకి ఇద్దరు సంతానం. కుమారుడు జొహార్‌, కుమార్తె జుయిష్‌. జుయిష్‌ పేరు గతంలో గోవా క్యాసినో వివాదంలో వినిపించింది. వరుడు అర్జున్‌ భల్లా కెనడాలో నివసిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని