ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు: ప్రముఖ హృద్రోగ నిపుణుడి వ్యాఖ్యలు

కొవిడ్‌-19పై పోరుకు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంస్థలు ఉత్పత్తి చేసిన టీకా వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని భారత సంతతికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు అసీమ్‌ మల్హోత్రా పేర్కొన్నారు.

Updated : 08 Feb 2023 09:23 IST

దిల్లీ: కొవిడ్‌-19పై పోరుకు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంస్థలు ఉత్పత్తి చేసిన టీకా వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని భారత సంతతికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు అసీమ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ టీకాను భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని మల్హోత్రా తెలిపారు. ఈ తరహా దుష్ప్రభావాలు ఉన్నాయంటూ ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్‌ టీకాలను నిషేధించాలని ఆయన చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కొవిషీల్డ్‌తో గుండెపై ఇంతకుమించిన స్థాయిలో నష్టాలు ఉంటాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. బ్రిటన్‌లో ఈ టీకా పొందినవారిలో పది శాతం మందికి ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని