165 కిలోల బరువును పళ్లతో ఎత్తిన జవాన్‌

బిహార్‌ రాష్ట్రంలోని కైమూర్‌ జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌ త్రిపుర రైఫిల్స్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్నారు.

Published : 09 Feb 2023 06:04 IST

బిహార్‌ రాష్ట్రంలోని కైమూర్‌ జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌ త్రిపుర రైఫిల్స్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన 165 కిలోల బరువును పళ్లతో ఎత్తి రికార్డు సృష్టించారు. సుమారు 10 సెకన్లపాటు ఆ బరువును గాలిలోకి ఎత్తారు. ధర్మేంద్ర ఇప్పటివరకు గిన్నిస్‌ బుక్‌ సహా 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ‘హ్యామర్‌ హెడ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుపొందారు. ఇటీవలే బైక్‌ను భుజాలపై ఎత్తుకొని 100 మీటర్ల దూరం పరిగెత్తారు. అంతకుముందు తలతో కొబ్బరికాయలు పగలగొట్టడం, పళ్లతో ఇనుమును వంచడం లాంటి విన్యాసాలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు