కోర్టు భవనంలోకి చిరుతపులి

ఓ చిరుత పులి ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం గాజియాబాద్‌లోని జిల్లా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి.. పది మందిని గాయపర్చింది.

Published : 09 Feb 2023 06:04 IST

అడ్డొచ్చిన పదిమందిపై దాడి
నాలుగు గంటల తర్వాత పట్టివేత

గాజియాబాద్‌: ఓ చిరుత పులి ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం గాజియాబాద్‌లోని జిల్లా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి.. పది మందిని గాయపర్చింది. కవినగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత మొదట న్యాయస్థానం భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి ప్రవేశించి ఒకరిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. నాలుగు గంటల పాటు శ్రమించిన అనంతరం అటవీ శాఖ సిబ్బంది చిరుతను బంధించినట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అభిషేక్‌ శ్రీవాస్తవ తెలిపారు. పులి దాడిలో ఇద్దరు న్యాయవాదులు, హెడ్‌ కానిస్టేబుల్‌, మరో ఏడుగురు గాయపడినట్లు చెప్పారు. అక్కడి నుంచి చిరుతపులిని అటవీ శాఖ సిబ్బంది తరలించినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని