Turkey Earthquake: దాచుకున్న డబ్బుతో తుర్కియే బాధితులకు జాకెట్లు

తుర్కియే, సిరియాల్లో భూకంపం సృష్టించిన విలయాన్ని టీవీలో చూసిన ఓ బాలుడి హృదయం ద్రవించిపోయింది.

Updated : 15 Feb 2023 06:47 IST

దిల్లీ బాలుడి పెద్ద మనసు

దిల్లీ: తుర్కియే, సిరియాల్లో భూకంపం సృష్టించిన విలయాన్ని టీవీలో చూసిన ఓ బాలుడి హృదయం ద్రవించిపోయింది. ముఖ్యంగా మంచు పడుతున్నప్పటికీ బయటే ముడుచుకు పడుకుంటున్న అక్కడి బాధితులను చూసి వారికోసం తన పరిధిలో ఏమైనా చేయాలని ఆలోచించాడు. ఆ బాలుడే దిల్లీకి చెందిన జైదాన్‌ ఖురేషీ. అనుకున్నదే తడవుగా వెంటనే తను దాచుకున్న రూ.7,500 తీసుకుని తండ్రిని వెంటపెట్టుకు వెళ్లి చలిలో ఉపయోగపడే 112 జాకెట్లను కొనేశాడు. మొత్తం ఖర్చు రూ. 22వేలు అయింది. తీరా చూస్తే తన దగ్గర రూ. ఏడువేల అయిదొందలే ఉన్నాయి. అయితే కుమారుడి ప్రయత్నాన్ని చూసి ముచ్చట పడ్డ తండ్రి కాశిఫ్‌ మిగతా సొమ్మును చెల్లించి వాటిని కొనుగోలు చేశారు. .జైదాన్‌ వెంటనే దిల్లీలోని తుర్కియే రాయబార కార్యాలయానికి తీసుకెళ్లి వాటిని విరాళంగా ఇచ్చేశాడు. త్వరగా బాధితులకు అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని