Organ Donation: 65 ఏళ్లు పైబడినవారూ ఇక అవయవాలు స్వీకరించొచ్చు!

ఇక నుంచి 65 ఏళ్లు పైబడిన రోగులు కూడా మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు.

Updated : 17 Feb 2023 06:47 IST

నిబంధనలు సవరించిన కేంద్రం

దిల్లీ: ఇక నుంచి 65 ఏళ్లు పైబడిన రోగులు కూడా మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘గతంలో గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లు ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన తొలగించడంతో ఏ వయసులో ఉన్నవారైనా మరణించిన వ్యక్తుల నుంచి అవయవాలు తీసుకోవచ్చు’’ అని ఓ అధికారి పేర్కొన్నారు. అంతేకాదు.. అవయవాలు స్వీకరించే రోగుల నుంచి నివాస ధ్రువపత్రాలను అడగకూడదని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ కోసం ఫీజులు కూడా వసూలు చేయకూడదని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని