యూట్యూబ్ ఛానళ్లు బంద్ చేయండి.. ఉద్యోగులకు కేరళ సర్కారు హుకుం
ప్రభుత్వ విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్ ఛానల్‌ను నడపరాదంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్ ఛానల్‌ను నడపరాదంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం అతి సామాన్యులు సైతం వారి ప్రతిభకు అనుగుణంగా యూట్యూబ్ ఛానల్స్ విజయవంతంగా నడుపుతున్న విషయం తెలిసిందే. కొందరు ఉద్యోగులు సైతం ఇదే బాట పట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నారు. వంటలు, కామెడీ కార్యక్రమాల వీడియోలు అప్‌లోడ్ చేసి రూ.లక్షల్లో సంపాదిస్తున్నవారూ ఉన్నారు. ఈ అదనపు ఆదాయ మార్గంపై వేటు వేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్ ఛానల్స్‌ను నిర్వహించవద్దంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని జీవోలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష