Robo shankar: హోం టూర్ తెచ్చిన తంటా.. నటుడికి రూ.2.5 లక్షల జరిమానా
అనుమతి లేకుండా ఇంట్లో చిలుకలు పెంచిన నటుడు రోబో శంకర్‌కు అటవీశాఖ రూ.2.5 లక్షల జరిమానా విధించింది.
చెన్నై (ప్యారిస్), న్యూస్‌టుడే: అనుమతి లేకుండా ఇంట్లో చిలుకలు పెంచిన నటుడు రోబో శంకర్(robo shankar)కు అటవీశాఖ రూ.2.5 లక్షల జరిమానా విధించింది. చెన్నై సాలిగ్రామంలో ఉంటున్న నటుడు రోబో శంకర్ ఇటీవల హోంటూర్ పేరుతో తన నివాసంలో ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. అందులో.. అలెగ్జాండ్రిన్ పారాకీట్ అనే చిలుకలు పంజరంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గురువారం రెండు చిలుకలను స్వాధీనం చేసుకుని గిండిలోని పార్కులో అప్పగించారు. అప్పుడు రోబో శంకర్, ఆయన భార్య శ్రీలంకలో ఉండటంతో దర్యాప్తునకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అటవీశాఖ అధికారుల ఎదుట హాజరై రోబో శంకర్ వివరణ ఇచ్చారు. తన భార్య స్నేహితురాలు మూడేళ్ల క్రితం ఈ చిలుకలను ఇచ్చినట్లు తెలిపారు. వీటిని పెంచేందుకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదని, ఇందుకు క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అధికారులు వారిపై కేసు నమోదు చేయకుండా రూ.2.5 లక్షల జరిమానా విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..