Nitish Kumar: మీరు అతిగా ఆంగ్లం మాట్లాడుతున్నారు.. ఇదేమన్నా ఇంగ్లాండా?

బిహార్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయానికి సంబంధించి బాపు సబాగార్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ‘నాలుగో వ్యవసాయ రోడ్‌మ్యాప్‌’.

Updated : 22 Feb 2023 08:53 IST

వ్యాపారవేత్తపై బిహార్‌ సీఎం నీతీశ్‌ మండిపాటు

పాట్నా: బిహార్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయానికి సంబంధించి బాపు సబాగార్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ‘నాలుగో వ్యవసాయ రోడ్‌మ్యాప్‌’ ప్రారంభ కార్యక్రమంలో వ్యవసాయ-పారిశ్రామికవేత్త  అమిత్‌కుమార్‌ సీఎం నీతీశ్‌ను ప్రశంసిస్తూ తన ఉపన్యాసాన్ని ఆంగ్లంలో ప్రారంభించారు. కొద్దినిమిషాల తర్వాత ముఖ్యమంత్రి ఆయన ప్రసంగాన్ని ఆపారు. ‘‘మీరు అతిగా ఆంగ్ల పదాలు మాట్లాడటం వల్ల నేను మధ్యలో జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఇదేమన్నా ఇంగ్లాండా? మీరు బిహార్‌లో ఎందుకు పని చేస్తున్నారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని మీరు అభ్యసిస్తున్నారు. గవర్నమెంట్‌ స్కీమ్స్‌ అనే బదులు సర్కారీ యోజన అనలేరా. నేనూ ఆంగ్ల మాధ్యమంలో ఇంజనీరింగ్‌ చదివాను. అది వేరే విషయం. రోజూవారీ కార్యకలాపాలకు ఆ భాషను ఎందుకు ఉపయోగించాలి’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని