వికటించిన మేకప్‌.. వధువు మొహంపై బొబ్బలు

పెళ్లి సమీపిస్తున్న తరుణంలో వధువు తన ముఖ వర్చస్సు కోసం చేయించుకున్న మేకప్‌ వికటించింది. దీంతో ఆమెను చేసుకోనంటూ వరుడు భీష్మించాడు.

Updated : 05 Mar 2023 04:21 IST

పెళ్లికి నిరాకరించిన వరుడు 

హాసన, న్యూస్‌టుడే:  పెళ్లి సమీపిస్తున్న తరుణంలో వధువు తన ముఖ వర్చస్సు కోసం చేయించుకున్న మేకప్‌ వికటించింది. దీంతో ఆమెను చేసుకోనంటూ వరుడు భీష్మించాడు. కర్ణాటకలోని హాసన జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. అరసికెరె తాలూకా జూజూరుకు చెందిన ఓ యువతి(25)కి వివాహం నిశ్చయమైంది. మరో పది రోజుల్లో పెళ్లనగా.. మేకప్‌ చేయించుకోవాలని ఆమెకు స్నేహితురాళ్లు సూచించారు. దీంతో ఆమె అరసికెరెలోని గంగశ్రీ బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. ప్రత్యేక మేకప్‌ చేస్తానని చెప్పిన బ్యూటీషియన్‌.. యువతి ముఖానికి ఫౌండేషన్‌ రాసి, ఆవిరిపట్టింది. దీంతో బుగ్గలు బొబ్బలెక్కి.. మచ్చలు వచ్చి ముఖం కళావిహీనంగా మారిపోయింది. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. అలర్జీ కారణంగా ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని వైద్యులు చెప్పారు.  బ్యూటీషియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వధువు ముఖాన్ని చూసిన వరుడు తనకు ఆమె వద్దంటూ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని