EPFO - Higher pension: 2014 సెప్టెంబరుకు ముందు రిటైరైన వారికి ముగిసిన గడువు

పదవీ విరమణ(2014 కన్నా ముందు) చెందిన సభ్యులకు...ఉద్యోగుల పింఛను పథకం-1995(ఈపీఎస్‌) కింద అధిక పింఛను ఐచ్ఛికం ఇవ్వడానికి గడువు శనివారంతో ముగిసింది.

Updated : 05 Mar 2023 08:11 IST

అధిక పింఛనుకు 91,258 దరఖాస్తులు

దిల్లీ: పదవీ విరమణ(2014 కన్నా ముందు) చెందిన సభ్యులకు...ఉద్యోగుల పింఛను పథకం-1995(ఈపీఎస్‌) కింద అధిక పింఛను ఐచ్ఛికం ఇవ్వడానికి గడువు శనివారంతో ముగిసింది.

ఈ కేటగిరీలో మార్చి 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో 91,258 మంది దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

* అయితే, ఈపీఎస్‌లోని ఇతర సభ్యులు ఈ ఏడాది మే 3వ తేదీ వరకు అధిక పింఛను ఆప్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

* ఉద్యోగులు, యాజమాన్యం ఇవ్వాల్సిన సంయుక్త ఐచ్ఛికాని(జాయింట్‌ ఆప్షన్‌)కి సంబంధించిన ప్రక్రియపై అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈపీఎఫ్‌వో చర్యలు తీసుకుంటుందని ఆ ప్రకటన వివరించింది.

* అధిక పింఛను కోసం.. 2014 సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి ఈపీఎఫ్‌ సభ్యులుగా ఉన్న వ్యక్తుల్లో 8,897 మంది శనివారం వరకు తమ యాజమాన్యాలకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.

* సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి అధిక పింఛను పథకం కోసం ఈపీఎస్‌ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలంటూ ఫిబ్రవరిలో ఈపీఎఫ్‌వో సర్క్యులర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని