అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ.. మానసిక హింసకు గురి చేస్తున్నారు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా సీబీఐ కస్టడీని శనివారం న్యాయస్థానం మరో రెండు రోజులు పొడిగించింది.
కోర్టుకు సిసోదియా ఫిర్యాదు
సీబీఐ కస్టడీ మరో 2 రోజులు పొడిగింపు
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా సీబీఐ కస్టడీని శనివారం న్యాయస్థానం మరో రెండు రోజులు పొడిగించింది. మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా గత ఆదివారం సిసోదియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం విధించిన 3 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు శనివారం ఆయనను కోర్టు ఎదుట హాజరుపర్చారు. విచారణకు ఆప్ నేత సహకరించడం లేదని, మరో మూడు రోజులు కస్టడీ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సిసోదియా.. సీబీఐ అధికారులు తనను బాగానే చూసుకుంటున్నారని.. అయితే అడిగిన ప్రశ్నలే అడుగుతూ మానసిక హింసకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ‘‘థర్డ్ డిగ్రీ ఉపయోగించడం లేదు. కానీ ఏడెనిమిది గంటలు ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా మానసిక హింసే’’ అని సిసోదియా తెలిపారు. దీనికి న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. అడిగిన ప్రశ్నలు మళ్లీ అడగొద్దని సీబీఐని ఆదేశించింది.
సిసోదియా, మాజీ అధికారులను ఎదురెదురుగా కూర్చోబెట్టి...
మద్యం కుంభకోణంలో సిసోదియాను ప్రశ్నిస్తున్న సీబీఐ బృందం....ఆయన చెబుతున్న సమాధానాల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చుకునేందుకు దిల్లీ మాజీ అధికారులను కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టింది. సిసోదియా మాజీ కార్యదర్శి సి.అరవింద్, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఎ.గోపీకృష్ణను అదే గదిలో ఉంచి జవాబులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సిసోదియా ప్రవర్తనను, హావభావాలను వారు నమోదు చేశారు. సిసోదియా తమకు సహకరించడంలేదని, తప్పించుకునే ధోరణిలో సమాధానాలు చెబుతున్నారని సీబీఐ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మరో ఇద్దరు కీలకమైన సాక్షులను కూడా సిసోదియా ముందుకు తీసుకువచ్చి ముఖాముఖీ ప్రశ్నించనున్నట్లు దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో కనిపించకుండా పోయిన దస్త్రాల జాడను కనిపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మాయమైన దస్త్రాల్లో నిపుణుల కమిటీ సిఫార్సులు, న్యాయ సలహాలకు సంబంధించినవి ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం
-
Ap-top-news News
లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు