‘నా భార్య అలిగింది.. 10 రోజులు సెలవు కావాలి’

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఓ పోలీసు అధికారి రాసిన సెలవు లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

Updated : 06 Mar 2023 08:05 IST

ఎస్పీకి ఇన్‌స్పెక్టర్‌ లేఖ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఓ పోలీసు అధికారి రాసిన సెలవు లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. గత 22ఏళ్లుగా తన భార్యను హోలీకి పుట్టింటికి తీసుకెళ్లనందుకు అలిగిందని.. ఆమెను శాంతపరచాలంటే 10 రోజులు సెలవు కావాలని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్పీకి లేఖ రాశారు. పోలీసు కొలువులో సెలవులు దొరకడం లేదని,. అందువల్ల వివాహమైన 22 ఏళ్ల నుంచి తన భార్యను హోలీ రోజున పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానని అందులో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈసారి హోలీకి నా భార్య నాతో కలిసి పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. కచ్చితంగా నాకు సెలవులు అవసరం. సర్‌, నా సమస్యను పరిగణనలోకి తీసుకొని 10రోజుల పాటు సెలవు ఇవ్వాలని కోరుతున్నాను’’ అని ఇన్‌స్పెక్టర్‌ రాసిన లేఖను చదివిన ఎస్పీ గట్టిగా నవ్వినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఇన్‌స్పెక్టర్‌ కోరినట్లు పది రోజులు కాకుండా.. ఐదు రోజుల సెలవు మంజూరు చేసినట్లు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని