Kacha Badam: కచ్చా బాదమ్‌ స్టార్‌కు ‘ఇంటి’ కష్టాలు!

కచ్చా బాదమ్‌ పాటతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన పశ్చిమబెంగాల్‌కు చెందిన భుబన్‌ బద్యాకర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Updated : 06 Mar 2023 09:26 IST

కచ్చా బాదమ్‌ పాటతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన పశ్చిమబెంగాల్‌కు చెందిన భుబన్‌ బద్యాకర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఒక్క పాటతోనే విపరీతమైన  క్రేజ్‌ను సంపాదించుకున్నారు ఈ శనగల వ్యాపారి. కానీ ప్రస్తుతం ఆయన ఇంటి అద్దె కట్టలేని స్థితికి చేరుకున్నారు. దీంతో స్వగ్రామాన్ని విడిచిపెట్టి వేరేచోటకు మారాల్సి వచ్చింది.

భుబన్‌ స్వస్థలం బీర్‌భూం జిల్లాలోని కురల్‌జూరి గ్రామం. తాను సెలబ్రిటీగా మారిన తర్వాత వచ్చిన డబ్బును గ్రామస్థులు పలు దఫాలుగా తన నుంచి కాజేశారని వాపోయారు భుబన్‌. గ్రామంలోని కొందరు యువకుల వేధింపులు భరించలేక స్వగ్రామాన్ని ఖాళీ చేసి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో అద్దె ఇంట్లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నానని తెలిపారు. మరోవైపు తాను పాడిన కచ్చా బాదమ్‌ పాటకు కాపీరైట్‌ రావడంవల్ల ఇప్పుడు తాను ఆ పాటను పాడలేనని చెబుతున్నారు భుబన్‌. ప్రస్తుతం ఆయన పాకుర్తలాలోని ఓ గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంటి అద్దె నెలకు రూ.2700. పచ్చి పల్లీలు, శనగలు అమ్ముకుంటూ భుబన్‌ కుటుంబాన్ని పోషించేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు