వ్యక్తిగతంగా ఉపయోగించాకే సిఫార్సు చేయాలి.. ప్రముఖుల వ్యాపార ప్రకటనలపై కేంద్రం మార్గదర్శకాలు

ప్రముఖు(సెలెబ్రిటీ)లు చేసే వ్యాపార ప్రకటనలకు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. సెలెబ్రిటీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసే వారికి ఇవి వర్తిస్తాయి.

Updated : 07 Mar 2023 07:12 IST

ఈనాడు, దిల్లీ: ప్రముఖు(సెలెబ్రిటీ)లు చేసే వ్యాపార ప్రకటనలకు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. సెలెబ్రిటీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసే వారికి ఇవి వర్తిస్తాయి. వివిధ వస్తువులు, సేవలకు ప్రచారం కల్పించే సమయంలో ప్రముఖులు తమకున్న పలుకుబడిని ఉపయోగించి వినియోగదారులను తప్పుదోవ పట్టించకుండా ఉండేందుకు ఈ మార్గదర్శకాలను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

‘‘ప్రచారమంతా కేంద్ర వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం, దానితో ముడిపడిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే సాగాలి. ప్రచారం సరళమైన, స్పష్టమైన భాషలో ఉండాలి. సెలెబ్రిటీలు డబ్బు తీసుకొని లేదంటే వస్తు మార్పిడి పద్ధతిలో చేసే ప్రకటనలపై తప్పనిసరిగా అడ్వర్టైజ్‌మెంట్‌, యాడ్‌, స్పాన్సర్డ్‌, కొలాబరేషన్‌, పార్ట్‌నర్‌షిప్‌ అన్న పదాల్లో ఏదో ఒకటి బహిరంగంగా ప్రదర్శించాలి. సదరు ఉత్పత్తి, సేవలను సెలెబ్రిటీలు వాస్తవంగా ఉపయోగించి, అనుభవం పొందిన తర్వాతే సిఫార్సు చేయాలి. పారదర్శకత పాటించడంతో పాటు, ప్రేక్షకుల్లో నమ్మకం పెంపొందించడానికి సామాజిక మాధ్యమాల్లో ప్రభావం చూపేవారంతా ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి’’ అని కేంద్రం స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని