‘స్పామ్‌’ కాల్స్‌కు చెక్‌.. త్వరలో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌

మనకు వచ్చే స్పామ్‌ కాల్స్‌ నంబర్లను కొన్ని థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా గుర్తించి బ్లాక్‌ చేసే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉంది.

Published : 07 Mar 2023 09:18 IST

మనకు వచ్చే స్పామ్‌ కాల్స్‌ నంబర్లను కొన్ని థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా గుర్తించి బ్లాక్‌ చేసే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఒకసారి బ్లాక్‌ చేస్తే మళ్లీ అదే నంబరు నుంచి కాల్స్‌ రావు. దీంతో స్పామ్‌ కాల్‌ చేసే వారు కొత్త పంథా అనుసరిస్తున్నారు. నేరుగా వాట్సాప్‌ నంబర్లకే కాల్‌ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌’ పేరిట ఈ ఫీచర్‌ను తీసుకొస్తోందని వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్‌ తెలిపింది. ఎవరైనా కొత్త నంబరు నుంచి కాల్‌ చేస్తే యూజర్‌కు రింగ్‌ రాకుండా ఈ ఫీచర్‌ నిరోధిస్తుంది. అలాంటి కాల్స్‌ వచ్చినప్పుడు నోటిఫికేషన్‌ బార్‌లో మాత్రమే కనిపిస్తుంది. అంటే మన ఫోన్‌ నంబర్ల జాబితాలో లేని ఎవరైనా కొత్త వ్యక్తులు మనకు ఫోన్‌ చేసినప్పుడు రింగ్‌ రాదన్నమాట. ఒకవేళ ఏదైనా విషయం చెప్పదలచుకుంటే మెసేజ్‌ రూపంలో తెలియజేస్తే అప్పుడు యూజర్‌ తన ఇష్టం మేరకు తిరిగి కాల్‌/ మెసేజ్‌ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉంది. ఎంపిక చేసిన ఆండ్రాయిడ్‌ యూజర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. ఐఓఎస్‌ యూజర్లకూ ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని