దేవుడికి నైవేద్యంగా సిగరెట్లు

గుజరాత్‌లోని సూరత్‌ అథ్వాలిన్స్‌ ప్రాంతంలో ఆదర్శ్‌ సొసైటీలో వంజారా భూత్‌మామ ఆలయంలో సిగరెట్లు నైవేద్యంగా పెడుతుండటం విశేషం.

Published : 08 Mar 2023 04:54 IST

గుజరాత్‌లోని సూరత్‌ అథ్వాలిన్స్‌ ప్రాంతంలో ఆదర్శ్‌ సొసైటీలో వంజారా భూత్‌మామ ఆలయంలో సిగరెట్లు నైవేద్యంగా పెడుతుండటం విశేషం. అలా చేస్తే కోర్కెలు తీరుతాయని భక్తులకు అపారమైన నమ్మకం. 130 ఏళ్ల క్రితం వంజరుల సమూహం ఇక్కడ నివసించేది. ఆ సమయంలో ఒక వంజర మరణించాడు. అతని సమాధిని ఇక్కడ నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని వంజర భూత్‌మామ అని పిలుస్తారు. క్రమంగా ఇక్కడ వంజారా భూత్‌మామ ఆలయం ఏర్పాటైంది. ఇక్కడే భక్తులు సిగరెట్లు వెలిగించి దైవాన్ని కొలుస్తున్నారు. ఇంకా మగాస్‌ అనే మిఠాయిలు కూడా భూత్‌మామకు నైవేద్యంగా పెడతారు. వాటిని సమర్పిస్తే.. చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని ప్రజలు నమ్ముతారు. మాగాస్‌ స్వీట్లను తమ దగ్గర పెట్టుకుంటే వారికి మంచి ఉద్యోగం వస్తుందని కూడా విశ్వసిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని