కాన్పుర్‌కు జ్వరమొచ్చింది.. బీ3వీ2 లక్షణాలతో భారీగా ఆసుపత్రులకు జనం

కొవిడ్‌ తగ్గుముఖం పట్టిందనుకొంటున్న సమయంలో హెచ్‌3ఎన్‌2(బీ3వీ2) ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ విజృంభిస్తోంది.

Updated : 09 Mar 2023 05:28 IST

కాన్పుర్‌: కొవిడ్‌ తగ్గుముఖం పట్టిందనుకొంటున్న సమయంలో హెచ్‌3ఎన్‌2(బీ3వీ2) ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ నగరంలోని హాల్లెట్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజులో జ్వరం, నిరంతరాయంగా దగ్గు, శ్వాసకోశ సమస్యలతో 200 కేసులు వచ్చాయి. వీటిల్లో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి బయట రోగులు బారులు తీరారు. మరోవైపు ప్రైవేటు వైద్యశాలలకు కూడా జ్వర బాధితులు పోటెత్తారు. ఇన్‌ఫ్లూయెంజా ఏ వైరస్‌కు ఉప రకంగా భావిస్తున్న హెచ్‌3ఎన్‌2 (బీ3వీ2) వైరస్‌ గత నెల రోజులుగా నగరంలో తీవ్రంగా వ్యాపించిందని నిపుణులు చెబుతున్నారు. హాల్లెట్‌ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు కిక్కిరిసిపోవడంతో రోగులను ఇతర వార్డులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది.

మూడు వారాలుంటున్న దగ్గు

హెచ్‌3ఎన్‌2 సోకిన 92శాతం వ్యక్తుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, 86 శాతం రోగుల్లో తీవ్రమైన దగ్గు, 27 శాతం బాధితుల్లో ఊపిరి అందకపోవడం, 16 శాతం మందిలో విపరీతమైన తుమ్ములు ప్రధాన లక్షణాలుగా ఉంటున్నాయి. ఈ వైరస్‌ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని